డబ్బింగ్ పూర్తి చేసుకున్న ''వేట''
|
సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి చక్కని సందేశం చెబుతూ నేటి యువతను ఆకట్టుకునేలా ఉత్కంఠత కలిగించే అంశాలతో రూపొందించామన్నారు. నిర్మాత మాట్లాడుతూ, బాలాదిత్య, స్వాతిప్రియ హీరోహీరోయిన్లుగా చక్కగా కుదిరారు.
డబ్బింగ్ చూశాక చిత్రంపై మరింత నమ్మకం పెరిగింది. ఒక చక్కని చిత్రాన్ని తీశామన్న తృప్తి కలిగిందన్నారు. ప్రేక్షకుల స్పందనతో మరిన్ని చిత్రాలు తీయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. ఈ చిత్రానికి కెమెరా: గొడితి వి. ప్రసాద్, సంగీతం: శివ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ధన్ రాజ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాము శ్రీను.