ఓల్డ్‌సిటీ నేపథ్యంలో... ''దత్తు''
|
గురువారం అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు మల్లిఖార్జునరావు క్లాప్ కొట్టగా, విజయబాపినీడు కెమేరా స్విచ్చాన్ చేశారు. రేమాండ్స్ వ్యాపారవేత్త హమీద్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, 1980నాడు మతకలహాల నేపధ్యంలో ఈ చిత్రం రూపొందుతోందని అన్నారు.
ఈ చిత్రంలో హీరోకు ఇద్దరు తండ్రులున్నా తల్లిని ఏమాత్రం తప్పు పట్టే విధంగా లేకుండా పాజిటీవ్‌వేలో చిత్రీకరించామన్నారు. ఇంకా రాజకీయనాయకులు యూత్‌ను ఎలా ఉపయోగించుకున్నారనే విషయాన్ని కూడా ఈ చిత్రంలో పొందుపరిచామన్నారు.
రెగ్యులర్ షూటింగ్ మార్చి 7 నుంచి ప్రారంభించి, జూన్‌లో విడుదల చేయనున్నామన్నారు. 'జల్సా' సినిమా ద్వారా చిత్రరంగానికి పరిచయమైన సంజయ్... 'దత్తు' ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. మిస్ ఎపి 2007గా ఎంపికయిన హీరోయిన్ నందిని ఈ చిత్రంలో మోడ్రన్ గర్ల్‌గా నటిస్తోంది.
ఈ చిత్రంలో నూతన్ ప్రసాద్, నాజర్, శరత్‌బాబు, గొల్లపూడి, బాబూమోహన్, పూజిత, సుమన్ శెట్టి తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యాం, సంగీతం: శ్రీరాం, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి.ఎస్.రెడ్డి.