"జల్సా" ఆడియోను ఆవిష్కరించిన మెగాస్టార్
|
దీంతో ఇలా భయపెట్టి మాట్లాడమనడం తప్పు అంటూ చమత్కరించి ఇలా మాట్లాడారు. 'బంగారం' షూటింగ్‌లో ఉండగానే త్రివిక్రమ్ కథ చెప్పారు. అందులో ఒక సీన్ బాగా నచ్చింది. దాన్ని కథగా మార్చమని చెప్పాను. ఆయన మానవత్వం ఉన్న మనిషి, అదే నన్ను చాలా సన్నిహితంగా చేసింది. ఇటువంటి దర్శకులు పరిశ్రమకు చాలా అవసరం అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
బాధగా వుంది: చరణ్
జల్సా ఆడియో పాటలు అపుడే ఇంటర్నెట్‌లలో వినిపించడం బాధాకరంగా వుంది. ఇలా ముందుగానే ఇంటర్నెట్ కేంద్రాల్లో వినిపిస్తాయని తాము
|
మళ్ళీ చేయాలనుంది: త్రివిక్రమ్
పవన్‌గారికి కథ చెప్పాను. బాగా నచ్చింది. అలాగే దేవీశ్రీప్రసాద్‌కు కాస్త కథ చెప్పాను. వెంటనే 'జల్సా' టైటిల్ సాంగ్ నాకు ఫోన్‌లోనే వినిపించారు. పవన్‌కిది సరైన కథ. అభిమానులు జల్సా చేసుకోవచ్చు. కొంతమందితో పరిచయం పరిచయంగానే మిగిలిపోతుంది. కొంతమందితో అలానే కంటిన్యూ చేయాలనిపిస్తుంది.
అంతబాగా మనిషి నమ్మే వ్యక్తి పవన్. ఆయనతో మళ్ళీ చిత్రం చేసేందుకు కథ చెప్పాలని ఉంది. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాన్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇలియానా, పార్వతి మెల్టన్, అల్లు అర్జున్, అరవింద్, నాగబాబు, ఆలీ, దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.