1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సుమంత్‌తో రమణగోగుల చిత్రం

గ్రీన్ మాంగోస్ సినిమా బేనర్‌ను స్థాపించి సుమంత్‌తో సంగీత దర్శకుడు రమణగోగుల
FileFILE
గ్రీన్ మాంగోస్ సినిమా బేనర్‌ను స్థాపించి సుమంత్‌తో సంగీత దర్శకుడు రమణగోగుల ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేనర్‌ను గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో డా|| అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రమణగోగుల శ్రావ్యమైన సంగీతాన్ని ఇస్తారు. మంచి అభిరుచి గల వ్యక్తి మంచి చిత్రాలు తీస్తారు. దానికి కమర్షియల్ జోడిస్తేనే విజయవంతం అవుతాయి. ఆ దిశగా రమణగోగుల పయనిస్తారనుకుంటున్నాను. మార్పు అనేది అవసరం. అలాగే మారుతున్న పరిస్థితులరీత్యా సినిమారంగంలోనూ మార్పు రావాలి అని చెప్పారు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న రాజ్ మాట్లాడుతూ "పరిమిత బడ్జెట్‌తోనే సుమంత్‌ను కలిసి కథ చెప్పాను. మూడు కథల్లో ఒకటి నచ్చింది. దాన్ని తుదిమెరుగులు దిద్ది సెట్ పైకి త్వరలో తీసుకెళ్ళబోతున్నాం" అని అన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ... 'ప్రేమంటే ఇదేరా' చిత్రానికి రమణగోగుల సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం నిర్మాతగా మారారు. చాలా సంతోషంగా ఉంది, అని చెప్పారు. "మన నేటివిటీకి దగ్గరగా ఉండే కథను రాజ్ అందించారనీ, టెక్నికల్ సెన్స్ ఉన్న దర్శకుడని" సుమంత్ తెలిపారు.
About Writer
PNR