హిందీ, తమిళంలో ''శ్రీరామదాసు''
|
అలాగే ఈ చిత్రానికిగాను కీరవాణి, నాగార్జునలకు జాతీయ అవార్డులొస్తాయని భావిస్తున్నాం. ఉత్తర భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా 'శ్రీరామదాసు' హిందీ అనువాదంలో కొన్ని మార్పులు చేస్తున్నాం. ఈ క్రమంలో కొంత భాగాన్ని రీషూట్ చేస్తున్నాం. భోజ్‌పురి, మరాఠి భాషలో కూడా అనువదించమంటూ కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు.
ఈ చిత్రానికిగాను ఉత్తమ మేకప్ మేన్‌గా ఎంపికైన నాగార్జున పర్సనల్ మేకప్ మేన్ సూర్యదేవర రామచంద్రరావు (చంద్ర) స్పందిస్తూ... "నాకు అవార్డు రావడం కన్నా చంద్రకి వచ్చినందుకు ఎక్కువ ఆనందంగా ఉందని బాబు (నాగార్జున) అనడం" నంది అవార్డు పొందిన దానికంటే ఎక్కువ సంతోషం కలిగించిందన్నారు. 1976లో అన్నపూర్ణ స్టూడియోలో అడుగుపెట్టాను. అక్కినేని ఫ్యామిలీ తనను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.