"ఆటాడిస్తా"మంటున్న నితిన్-కాజల్
Publish: Mon, 3 Mar 2008 (15:54 IST)
Updated: Mon, 3 Mar 2008 (15:53 IST)
రేఖా కంబైన్స్ సమర్పణలో నితిన్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా ఆటాడిస్తా అనే చిత్రం నిర్మితమవుతోంది. ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఒక పాట మినహా మిగిలిన కార్యక్రమాలు అంతా పూర్తయ్యాయి. ఈ చిత్రం ప్రోగ్రెస్‌పై దర్శక నిర్మాత మాట్లాడుతూ చిత్రం ఆడియోను ఇటీవలే విడుదల చేశామన్నారు. సుప్రీం ఆడియో ద్వారా విడుదలైన ఈ చిత్రం పాటలు మంచి ప్రేక్షకాధారణ పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే చిత్రం షూటింగ్ డబ్బింగ్‌తో పాటు ఇతర కార్యక్రమాలు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిపోయిన ఒక పాటను నితిన్, ముమైత్‌ఖాన్‌లపై పూర్తి చేసి ఈ నెలఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.