1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

భువనేశ్వరి కీలక పాత్రలో "కుర్‌కురే"

బుల్లితెర నటీమణి
FileFILE
బుల్లితెర నటీమణి, సెక్సీభామ భువనేశ్వరి కీలక పాత్రధారిగా "కుర్‌కురే" అనే చిత్రం నిర్మితం కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ హాస్యనటుడు దువ్వాసి మోహన్ హీరోగా నటిస్తున్నారు. శివ ఆర్ట్స్ ప్రొడక్షన్‌పై జునైద్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని నిర్మాత మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రోగ్రెస్‌పై నిర్మాత మాట్లాడుతూ చిత్ర షూటింగ్ చాలా భాగం పూర్తి చేశామన్నారు. మిగిలిన కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసి వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

కీలక పాత్రధారి భువనేశ్వరి మాట్లాడుతూ తన చుట్టూ కథ నడుస్తుంది. ముఖ్యంగా చాలాకాలం తర్వాత తెలుగులో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది. ఈ విషయంపై నిర్మాతదర్శకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. రాజేశ్వరి సంగీతబాణీలు సమకూర్చిన ఈ చిత్రంలో రెండు ప్రధాన పాటలతో పాటు 18 పారడీ పాటలు వుంటాయని వారు తెలిపారు.
About Writer
PNR