టాలీవుడ్ ''హిట్'' తారల ఇళ్లపై ఐటీ దాడులు
గత ఏడాది 'పోకిరి' విజయంతో అనూహ్య లాభాలు గడించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంటిపై ఆమధ్య ఐటీ దాడులు నిర్వహించారు. అదేవిధంగా 'బొమ్మరిల్లు' నిర్మాత 'దిల్' రాజు ఇంటిలోనూ సోదాలు చేశారు. అలాగే హీరో రవితేజ ఇంటిలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.
నిన్న... సోమవారం టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లతోపాటు వారి బంధువుల ఇళ్లపై దాడులు చేసి బ్యాంక్ లాకర్లను సీజ్ చేశారు. ఇదే సమయంలో చెన్నైలోని వారి ఆస్తులపై కూడా ఏకకాలంలో దాడులు జరిగాయి. హీరో మహేష్, హీరోయిన్ ఛార్మి, వి.వి వినాయక్, దిల్ రాజులు ఐటీ దాడులకు గురయ్యారు.
మహేష్ బాబు ఇటీవల కాలంలో అత్యధిక పారితోషికం తీసుకోవటంతోపాటు పలు ప్రకటనా సంస్థల్లో అత్యధిక పారితోషికం, మల్టీ నేషనల్ కంపెనీలు మహేష్‌తో చిత్రాలు నిర్మించటం వంటి వార్తలు రావటంతో ఐటీ ఆయనపై దృష్టి సారించినట్లు తెలిసింది. అదేవిధంగా 'మంత్ర' చిత్రంతో హిట్ హీరోయిన్‌గా నిలిచిన ఛార్మి ఇంటిపైనా ఇటువంటి దాడులు జరిగాయి.
ఇక ఈ ఏడాది 'కృష్ణ' చిత్రంతో సంక్రాంతి డైరెక్టరుగా విజయం సాధించిన వినాయక్ కూడా ఐటీ దాడులకు గురయ్యారు. అగ్ర హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించే వినాయక్ అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకునిగా పేరుంది. ఇక దిల్ ఉన్న రాజుగా పేరు సంపాదించిన రాజు 'బొమ్మరిల్లు' విజయంతో భారీ ఆదాయాన్ని పొందారు. ఈ దాడులు జరిగేటపుడు ఎవరినీ అనుమతించకుండా అధికారులు సోదాలు నిర్వహించారు. రేపు ఉదయం వరకూ ఐటీ దాడులు జరుగవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా... ఇటువంటి దాడులు సర్వసాధారణమేనని దిల్ రాజు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.