జోర్డాన్‌కు అల్లు అర్జున్ పరుగో "పరుగు"
|
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 'దిల్'రాజు నిర్మిస్తుండగా, 'బొమ్మరిల్లు' ఫేం భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ కోసం ఈనెల 15వ తేదీ నుంచి జోర్డాన్‌కు వెళ్లనుంది. మరో రెండు పాటలు మినహా మిగిలి చిత్రం షూటింగ్ అంతా పూర్తయింది. దీనిపై రాజు మాట్లాడుతూ.. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రం వుంటుంది.
మూడు ఫైట్లు, ఆరు పాటలతో రసవత్తరంగా చిత్ర కథ సాగుతుంది. వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చే ఈ చిత్రానికి కెమెరా...విజయ్ కె.చక్రవర్తి, ఎడిటర్...మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్...ఆనంద్ సాయి, సహ నిర్మాతలు..శిరీష్, లక్ష్మణ్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం భాస్కర్.