1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

హైదరాబాద్‌లో ఐశ్వర్యారాయ్

బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యారాయ్ హైదరాబాద్‌కు విచ్చేశారు. హృతిక్ రోషన్
FileFILE
బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యారాయ్ హైదరాబాద్‌కు విచ్చేశారు. హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ తాజాగా నటించిన "జోధా అక్బర్" చిత్రం ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో యూటీవీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా కాసుల వర్షం కురిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ముందుగా ఈ చిత్రం ప్రివ్యూను హైదరాబాద్‌లో గురువారం ప్రదర్శించనున్నారు. దీన్ని తిలకించేందుకు ఐశ్వర్యారాయ్‌తో పాటు హీరో హృతిక్ రోషన్‌, దర్శకుడు మరికొందరు బాలీవుడ్ నటులు హాజరుకానున్నారు.
About Writer
PNR