1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వేసవిలో "మైఖేల్ మదన్ కామరాజు"

అలనాడు పద్మశ్రీ కమల్ హాసన్ నటించిన చిత్రం మైఖేల్ మదన్
WD PhotoWD
అలనాడు పద్మశ్రీ కమల్ హాసన్ నటించిన చిత్రం మైఖేల్ మదన్ కామరాజు. అదే పేరుతో తాజాగా ప్రభుదేవా, శ్రీకాంత్, సునీల్‌లు ప్రధాన పాత్రదారులుగా ఇదే పేరుతో ఓ చిత్రం నిర్మితంకానుంది. సిల్వర్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిధి ప్రసాద్ దర్శకుడు. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ సరసన ఛార్మీ జంటగా నటిస్తోంది. ప్రభుదేవా, సునీల్, ఆశాశైనీలు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

దీనిపై దర్శకుడు మాట్లాడుతూ చిత్రం చిత్రీకరణ పూర్తయింది. హాస్యరస ప్రధాన చిత్రమిది. కథకు తగిన పేరు. వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇంకా ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, వేణుమాధవ్, జయప్రకాష్ రెడ్డి, గిరిబాబు, మల్లిఖార్జునరావు, ఎల్బీ.శ్రీరామ్, కొండవలస, కోవైసరళ, అభినయశ్రీ, కవిత, సంగీత, తులసి, అర్జన, రవళి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి పాటలు.. భాస్కరభట్ల, కందికొండ, ఆర్ట్.. పేకేటి రంగా, ఫైట్స్.. రామ్ లక్ష్మణ్, నిర్మాతలు మన్నెం వెంకటరమణ, యోగేష్ పటేల్, రాజు-ప్రవీణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. నిధి ప్రసాద్.
About Writer
PNR