1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"హోమం" పూర్తి చేసిన జగపతిబాబు - మమతా

శ్రేయా ప్రొడక్షన్ పతాకంపై హీరో జెడి.చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం
FileFILE
శ్రేయా ప్రొడక్షన్ పతాకంపై హీరో జెడి.చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం హోమం. ఈ చిత్రంలో జగపతిబాబు, మమతా మోహన్‌దాస్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాత కిరణ్ కుమార్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకోంటోంది. దీనిపై నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఫ్యామిలీ, సెంటిమెంట్, యాక్షన్ ప్రధానాంశాలుగా "హోమం" చిత్రం సాగుతోంది.

జగపతిబాబు ఈ చిత్రంలో విభిన్న పాత్రలో నటిస్తున్నారు. జెడిచక్రవర్తి దర్శకత్వం వహించడంతో పాటు.. ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. హిందీ సంగీత దర్శకుడు నితిన్ చక్కటి సంగీత బాణీలను సమకూర్చారు. మొత్తం ఐదు పాటలున్న 'హోమం'.. 'కంపెనీ', 'సత్య' చిత్రాల తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. పోలీస్ మాఫియా నేపథ్యంలో సాగే కథ ప్రేక్షకులను అలరిస్తుందని, ఈ నెలలో ఆడియోను విడుదల చేసి, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

ఇంకా ఈ చిత్రంలో మధురిమ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, ఎమ్మెస్.నారాయణ, టార్జాన్, రాజారవీంద్ర, ఆహుతి ప్రసాద్, కృష్ణభగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా.. భరణి, పాటలు.. సుద్దాల అశోక్‌తేజ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. జెడిచక్రవర్తి.
About Writer
PNR