1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"చింతకాయల రవి"గా విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ మరోసారి విభిన్న తరహా పాత్రలో కనిపించనున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా
FileFILE
విక్టరీ వెంకటేష్ మరోసారి విభిన్న తరహా పాత్రలో కనిపించనున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటిస్తున్న ఆయన తాజా చిత్రానికి "చింతకాయల రవి" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యోగి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క, మమతా మోహన్‌దాస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి నరసింహా విజువల్స్ పతాకంపై నల్లమలుపు (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆదివారం ప్రారంభమైంది.

దక్షిణాది మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు తొలి క్లాప్ కొట్టగా, డి.సురేష్ బాబు కెమరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నిర్మాత బుజ్జి మాట్లాడుతూ "లక్ష్మీ" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మా బ్యానర్‌లో చేస్తున్న చిత్రం. ఇప్పటికే ఈ చిత్రం టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, చిత్రం కూడా ఇలాగే అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని చెప్పారు. "ఓం శాంతి ఓం" చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన విశాల్-శేఖర్‌ల జంట 'చింతకాయల రవి'కి సంగీత బాణీలను సమకూర్చుతున్నారని చెప్పారు.

ఈ చిత్రంలో ఇంకా బ్రహ్మానందం, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, సునీల్, వేణుమాధవ్, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, పాటలు.. చంద్రబోస్, కథ, మాటలు.. కోన వెంకట్, ఆర్ట్.. చిన్నా, కెమెరా.. కె.రవీంద్రబాబు, నిర్మాత.. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), స్క్రీన్ ప్లే దర్శకత్వం.. యోగి.ఎం.
About Writer
PNR