నితిన్ హీరోగా టీవీ-5 న్యూస్ ఛానల్ చిత్రం
|
ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రానికి రాజమౌళి శిష్యుడు జె.కరుణకుమార్ దర్శకునిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్ర నిర్మాత డి.ఎస్.రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ... కుమార్ చెప్పిన కథాబలంతో ఈ చిత్రాన్ని టీవీ-5 ఛానెల్ సహకారంలో నిర్మిస్తున్నామని, ఈనెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన అన్నారు.
తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని దర్శకుడు వెల్లడించారు. హీరో నితిన్ మాట్లాడుతూ... "సై" చిత్రం నుంచి కరుణకుమార్ బాగా తెలుసునని, ఆయన చెప్పిన కథ రాజమౌళి తరహాలో ఉందని, నాకు నచ్చడంతో నటించేందుకు సై అన్నానని చెప్పారు. ఈ చిత్రం పక్కా మాస్ సినిమా అని, ఇంకా ఇతర నటీనటులను ఎంపిక చేయాల్సి ఉందని వెల్లడించారు.