1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''హ్యాపీడేస్'' స్ఫూర్తితో "అంకిత్.. పల్లవి అండ్ ఫ్రెండ్స్"

'హ్యాపీడేస్' చిత్రం ఇచ్చిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని హరి ఎల్లేటి దర్శకునిగా పరిచయం
WD PhotoWD
'హ్యాపీడేస్' చిత్రం ఇచ్చిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని హరి ఎల్లేటి దర్శకునిగా పరిచయం చేస్తూ.. "అంకిత్.. పల్లవి అండ్ ఫ్రెండ్స్" పేరుతో ఒక సినిమా రూపొందుతోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చిత్రంలో రెండు పాటలు మినహా మిగిలిన చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. దీనిపై దర్శకుడు హరి ఎల్లేటి మాట్లాడుతూ.. 'హ్యాపీడేస్' చిత్రానికి ముందుగానే నిఖిల్‌ను నెట్‌ద్వారా సెలెక్ట్ చేశాను. కెమెరామెన్‌గా మాలిని దాసరిని పరిచయం చేస్తున్నాను.

అంతా యూత్‌ టెక్నీషియన్‌తో యూత్‌ఫుల్ సినిమాను రూపొందించాం. నలుగురు అమ్మాయిలు, అబ్బాయిలు జీవితంలో హ్యాపీగా ఉండాలంటే ఏం చేశారు? వారికి తమ తల్లిదండ్రుల నుంచి ఎటువంటి ప్రోత్సాహం, స్పందన లభించింది.? అనేది చిత్ర కథాంశం. స్క్రీన్ ప్లే బేస్‌డ్ సబ్జెక్ట్. ఈనెలలో మిగిలిన పాటల చిత్రీకరణ పూర్తి చేసి ఆడియోను త్వరలో విడుదల చేస్తాం. చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేస్తామన్నారు.

ఇంకా ఈ చిత్రంలో సంతోష్ పవన్, సూర్య, ప్రదీప్, రామ్‌జగన్, శివన్నారాయణ, శ్రీలత, రేవతి, తదితరులు నటించారు. సంగీతం.. విను థామస్, ఎడిటింగ్.. మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు.. కిషోర్ గంజి, రఘు, సహ నిర్మాతలు.. జక్కంపూడి వెంకటేష్, హరి ఎల్లేటి, కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం హరి ఎల్లేటి.
About Writer
PNR