"అర్థం చేసుకోరూ.." అంటున్న భూషణ్.. తేజస్విని
|
అనంతరం నాయుడు మాట్లాడుతూ.. నాగభూషణం కూతురి కొడుకు, ప్రఖ్యాత ఛాయాగ్రహకులు స్వర్గీయ ఎల్‌డి.లాల్ మనుమడైన భూషణ్ హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు. సినిమా రంగానికి చెందిన అన్ని శాఖలవారు ఉన్న ఓ కుటుంబం నుంచి వచ్చిన భూషణ్ మంచి విజయాన్ని సాధిస్తాడనే నమ్మకం ఉందన్నారు.
అనంతరం దశరథ్ మాట్లాడుతూ.. మా కెరీరియర్ నుంచి మీర్‌గారు మాకు తెలుసు. ఆయన మాకు ఎన్నో మార్గదర్శకాలను సూచించాడు. వారి కుమారులైన భూషణ్ హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం హీరో భూషణ్ తండ్రి మీర్ మాట్లాడుతూ.. భూషణ్ స్వయంగా నటనలో శిక్షణ పొంది నటుడు కావాలనే ఆశయంతో వచ్చాడు. మంచి భవిష్యత్ ఉండాలని ఆశీర్వదిస్తున్నా అని అన్నారు.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా కథను తయారు చేసుకున్న తర్వాత "స్వర్ణకమలం"లో భానుప్రియ అర్థం చేసుకోరూ అనే డైలాగ్ గుర్తుకు వచ్చి ఈ సినిమాకు ఆ మాటనే టైటిల్‌గా ఖరారు చేశామన్నారు. షూటింగ్ పూర్తయిందనీ, పోస్ట్‌ప్రొడక్షన్స్ జరుగుతున్నాయని నిర్మాత చెప్పారు.