1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"విక్టరీ" చేతులమీదుగా "భలే దొంగలు" ఆడియో

శ్రీలక్ష్మీ దేవీ ఫిలింమ్స్ బేనర్‌పై రూపొందుతున్న చిత్రం
WD PhotoWD
శ్రీలక్ష్మీ దేవీ ఫిలింమ్స్ బేనర్‌పై రూపొందుతున్న చిత్రం "భలేదొంగలు". ఈ చిత్రంలో తరుణ్, ఇలియానా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో క్యాసెట్‌ను విక్టరీ వెంకటేష్ ఆవిష్కరించి, తొలి క్యాసెట్‌ను మరో హీరో రవితేజకు అందజేశారు. ఈ సందర్భంగా చిత్రం సమర్పకుడు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... దర్శకుడు విజయభాస్కర్ చిత్రాలంటే వినోదాత్మకంగా ఉంటాయి. ఆ కోవలో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో 'భలేదొంగలు' చిత్రాన్ని నిర్మించామన్నారు.

ఈ చిత్రంలో జగపతిబాబు ప్రత్యేక పాత్రను పోషించారని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ విజయభాస్కర్ చిత్రాల్లో డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఆ కోవలేనే 'భలేదొంగలు' చిత్రం రూపొందుతుంది. ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో నటించాను. భవిష్యత్‌లో కూడా ఓ చిత్రం చేయాలని ఉందని విక్టరీ అన్నారు.

హీరో తరుణ్ మాట్లాడుతూ.. ఇలియానాతో మళ్లీ మళ్లీ చేయాలని ఉందన్నారు. నటి ఛార్మీ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను తొలిసారి ఐటం సాంగ్‌ చేస్తున్నట్టు చెప్పారు. "భలేదొంగలు" చిత్ర టైటిల్‌కు 'క్యాచ్‌ దెమ్ ఇఫ్ యు కెన్' అనే ట్యాగ్‌ను కలిపినట్టు నిర్మాత శాఖమూరి పాండురంగారావు వెల్లడించారు.
About Writer
PNR