1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అంగరంగ వైభవంగా రజనీ ''కుచేలుడు'' ప్రారంభం

రజనీకాంత్ కుచేలుడు చిరంజీవి చంద్రబాబు నాయుడు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుచేలుడు చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం మాదాపూర్ లోని హైటెక్స్ బిజినెస్ కన్వెన్షన్ హాలులో అత్యంత ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా... దాసరి నారాయణరావు స్విచాన్ చేశారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... తాను ఇటీవల మనశ్శాంతిని కోల్పోయినప్పుడు రజనీ తన మాటలతో మనోధైర్యాన్ని కల్పించారన్నారు. రజనీ మాటలలో ఏదో ఆధ్యాత్మిక శక్తి ఉందనీ అన్నారు.

రజనీకాంత్ మాట్లాడుతూ... "1978ల కాలంలో తాను ఏ సినీ రంగంలో స్థిరపడాలో ఎదురుచూస్తున్న సమయం. అప్పట్లో తెలుగు, తమిళ చిత్రాలలో నాకు అవకాశాలు వస్తున్నాయి. ఆ సమయంలో కె. బాలచందర్ ఏదో ఒకటి నిర్ణయించుకోమని సలహా ఇచ్చారు. ఇదే విషయాన్ని అప్పటి నా తెలుగు(హీరో) మిత్రునికి చెప్పాను. దానికి అతను తెలుగు సినీ పరిశ్రమ అంతా రాజకీయాలమయం. తమిళ చిత్ర పరిశ్రమే బెస్ట్ అన్నాడు.

చివరికి నాకు తెలిసిందేమంటే తనకు నేను పోటీ అవుతానేమోనని అలా చెప్పాడని తెలిసింది. అదేవిధంగా ఒకప్పుడు తెలుగు చిత్రానికి పనిచేసినందుకు సదరు తెలుగు నిర్మాత హైదరబాదులోని సారథి స్టూడియోస్ ప్రక్కనే ఒకటిన్నర ఎకరాన్ని పారితోషికంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని కూడా సదరు తెలుగు మిత్రునికి చెప్పాను. రాళ్లు, రప్పలతో నిండిన ఆ నేల ఎందుకన్నాడు... డబ్బుతీసుకుని సరిపెట్టుకోమన్నాడు. ఇప్పుడు సారథి స్టూడియో వైపు వెళ్లాలంటేనే బాధగా ఉంటుంది" అని అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

కాగా ఈ కార్యక్రమంలో మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇతరి సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT