చిరు, బాబు కలవబోతున్నారా...?
|
ఏదేమైనా చిరంజీవి రాజకీయ ప్రవేశంపై వివిధ పార్టీలు తమతో కలిసి రావాలని తమ అభిప్రాయాలు చెప్పినా... చంద్రబాబు మాత్రం ఇప్పటివరకూ దానిపై నోరు మెదపలేదు. కానీ కార్యక్రమంలో బాబు మాట్లాడిన తీరును చూస్తే వారిద్దరూ కలిసి పనిచేస్తారేమో అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పైగా చిరంజీవికి చంద్రబాబుకు ఎప్పటినుంచో మంచి సంబంధాలున్నాయి. గతంలో విజయవాడ లోక్‌సభ సీటును చిరు రికమెండేషన్‌పై అశ్వనీదత్‌కు ఇచ్చారనే వార్తలు వచ్చాయి. దాంతో చిరు అభిమానులే అశ్వనీదత్‌ను ఓడించటం విశేషం. ఇటీవలే అంటే... గత శుక్రవారం నాడు కోస్తాంధ్ర తెలుగుదేశం నాయకుడు చిరు మా పార్టీలో కలిసి వస్తే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని ప్రకటించటం విశేషం.
విజయవాడలో చిరు కటౌట్లు ధ్వంసం...
ఇదిలా ఉండగా విజయవాడలోని కృష్ణలంకలో ఆదివారంనాడు చిరంజీవి కటౌట్లు కొన్నిచోట్ల డామేజ్ అయి ఉన్నాయి. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని కటౌట్ల కట్టారు. దీంతో అక్కడ చిరు అభిమానులు అధ్యక్షుడు నాయుడు పెద్ద గందరగోళం సృష్టించి కాంగ్రెస్‌వారే ఇలా చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవి యాదృశ్చికంగా జరిగాయా? ఎవరైనా చేశారా? అనేది పోలీసులు చెప్పలేక మల్లగుల్లాలు పడుతున్నారు.