నటి ఆషాసైనీకి షరతులతో కూడిన బెయిలు
నకిలీ వీసా కుంభకోణంలో పట్టుబడిన సినీ నటి ఆషాసైనీకి మద్రాసు హైకోర్టు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. రూ.50 వేల నగదుతో సొంత పూచీకత్తు సమర్పించినప్పటికీ.. షరతులను కూడా విధించింది. ముందస్తు అనుమతి లేకుండా నగరం విడిచి పోరాదని, రెండు రోజులకు ఒకసారి స్థానిక పోలీసు స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
ప్రస్తుతం మహిళా జైలులో ఉంటున్న ఆషాసైనీ హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో మంగళవారం విడుదలయ్యే అవకాశం ఉంది. నకిలీ డాక్యుమెంట్లను సమర్పించి తన పర్సనల్ మేకప్ ఉమెన్‌ను అమెరికా పంపించిందంటూ ఆషాసైనీపై అభియోగాలు నమోదైన విషయం విదితమే. ఈ వీసా స్కామ్‌లో ఇంకా అనేక మంది తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్ర ప్రముఖులకు సంబంధం ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అంతేకాకుండా అమెరికా వీసా అధికారులు పలువురు దక్షిణాది సినీ ప్రముఖులపై ఓ కన్నేసి, ఒక జాబితాను తయారు చేసినట్టు సమాచారం. వీరికి ఇకపై అమెరికా వెళ్లేందుకు వీసాను మంజూరు చేయరాదని యూఎస్ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం.