1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

జూనియర్ ఎన్టీఆర్ సరసన త్రిషా

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వివి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా
FileFILE
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వివి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో త్రిషా హీరోయిన్‌గా నటించనుంది. గుడివాడ ఎమ్మెల్యే, నిర్మాత కొడాలి నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్-వినాయక్‌ల కాంబినేషన్‌లో లోగడ వచ్చిన "ఆది", "సాంబ" చిత్రాలు మంచి సక్సెస్‌ సాధించిన విషయం తెల్సిందే. అలాగే త్రిషా తెలుగులో పలువురు అగ్రస్థాయి హీరోలతో నటించి మంచి మార్కులు కొట్టేసింది. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ వంటి హీరోల సరసన త్రిష హీరోయిన్‌గా చేశారు.

తాజాగా యువసామ్రాట్ నాగార్జున నటిస్తూ శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఆ కోవలోనే మరో ఆఫర్ త్రిషాను వరించింది. శ్రియ బాలీవుడ్‌పై దృష్టి సారించడం, నయనతార తెలుగులో పరిమితంగా నటిస్తూ.. తమిళ చిత్ర రంగంలో స్థిరపడి పోవాలని భావించడంతో త్రిషాకు తెలుగులో డిమాండ్ పెరిగింది. అందువల్లే ఆమెకు అవకాశాలు వస్తున్నాయని టాలీవుడ్ పరిశ్రమ వర్గాల భొగొట్టా.
About Writer
PNR