1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సినీ నటుడు రఘువరన్ మృతి

మిస్టర్ భరత్' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు వచ్చిన రఘువరన్‌కు 59 ఏళ్లు. 'శివ' చిత్రంలో ప్రతినాయుకుడుగా
తెలుగు, తమిళం చిత్రాల్లో సహా హిందీ చిత్రాల్లోను నటించి మెప్పించిన విలక్షణ నటుడు రఘువరన్ హఠాన్మరణం చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్రంగా గుండెపోటు రావడంతో మృతి చెందారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

'మిస్టర్ భరత్' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు వచ్చిన రఘువరన్‌కు 59 ఏళ్లు. 'శివ' చిత్రంలో ప్రతినాయుకుడుగా అత్యుత్తమనటన కనబరిచి అశేషాంధ్రప్రేక్షకులకు దగ్గరయ్యారు. రఘువరన్ మృతి పట్ల యావత్ సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ రంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.

1982లో సినీ పరిశ్రమలోకి ఆయన అడుగు పెట్టారు. దక్షిణాది చిత్రాల్లో ఆయన అనేక చిత్రాల్లో నటించారు.
About Writer
Hanumantha Reddy