1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''నటభూషణ'' శోభన్‌బాబు హఠాన్మరణం

సినీ ప్రముఖ హీరోల్లో ఒకరైన నటభూషణ శోభన్‌బాబు హఠాన్మరణం చెందారు. ఆయన
నాటి తరం తెలుగు సినీ ప్రముఖ హీరోల్లో ఒకరైన నటభూషణ్ శోభన్‌బాబు హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. గురువారం చెన్నైలోని తన నివాసంలో అస్వస్థతకు గురవడంతో అప్పోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

విలక్షణ నటుడైన శోభన్‌బాబు స్వస్థలం కృష్ణాజిల్లాలోని నందిగ్రామం. ఆయన పూర్తి పేరు ఉప్పు శోభనా చలపతిరావు. వీరాభిమన్యు చిత్రంతో తెలుగుప్రేక్షకుల మన్ననలు పొందిన శోభన్‌బాబు తన చలన చిత్ర జీవితంలో ఐదు నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు పొందారు. శోభన్‌బాబు మొదటి చిత్రం 'దైవబలం'... చివరి చిత్రం 'అడవిదొర'.

ఇద్దరు భార్యల భర్తగా అధికపాత్రల్లో శోభన్‌బాబు నటించి అశేషప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో విభిన్న నటుడిగా గుర్తింపు పొందారు. లవకుశ, నర్తనశాల, వీరాభిమన్యు వంటి అలనాటి పౌరాణిక చిత్రాల్లో నటించి పేరుగాంచిన శోభన్‌బాబు.. జీవనతరంగాలు, సర్పయాగం, డాక్టర్‌బాబు, మైనరుబాబు, గంగ-మంగ, జీవనజ్యోతి, కార్తీకదీపం, గోరింటాకు వంటి పలు సాంఘిక చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన హఠాన్మరణంతో యావత్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది.
About Writer
Hanumantha Reddy