1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నిర్మాతగా మారిన బాలీవుడ్ భామ శిల్పాశెట్టి

FileFILE
"సెలిబ్రిటీ బిగ్ బ్రదర్-2007" విజేత బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి నిర్మాతగా మారారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొంతమంది అంతర్జాతీయ టెక్నీషియన్లు కూడా పని చేయనున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ఎస్-2 గ్లోబల్ ప్రొడక్షన్‌పై శిల్పాశెట్టి ఈ కొత్త చిత్రాన్ని నిర్మించనుంది. ఈ విషయాన్ని ఆమె ప్రచారకర్త దలే భాగ్వాగర్ స్పష్టం చేశారు. ఇంకా ఈ చిత్రం వివరాలు వెల్లడిస్తూ.. ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా... అందులో ఒక పాత్రను శిల్పా పోషిస్తోందని చెప్పారు. అయితే.. హీరో ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. గత ఏడాది "బ్రిటన్ బిగ్ర బ్రదర్ షో" విజేతతో శిల్పా శెట్టికి దశ తిరిగిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం తాను స్వయంగా రూపొందించనున్న తాజా చిత్రంలో శిల్పాశెట్టి తనకు ఇష్టమైన పాత్రలో నటించనుందని భాగ్వాగర్ వెల్లడించారు. అంతర్జాతీయంగా పాపులర్ అయ్యాక శిల్పాశెట్టికి ఎన్నో ఆఫర్లు వచ్చినట్టు ప్రచారకర్త వెల్లడించారు. ప్రస్తుతం శిల్పాశెట్టి సన్నీ.. డియోల్, నీరజ్ పాథక్ సరసన నటించే "ది మ్యాన్", మరో అంతర్జాతీయ ప్రాజెక్టు "హనుమాన్" చిత్రాల్లో నటిస్తోంది. 'హనుమాన్' చిత్రంలో సీత పాత్రను పోషిస్తుండగా, 'ది మ్యాన్' సినిమాలో సాధారణ యువతి పాత్రను పోషిస్తోంది.
About Writer
PNR