1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

బుల్లితెర భువన "భారీ" డిమాండ్

బుల్లితెరలో లభించే పాత్రలు వేసుకుంటూ కాలంగడుపుతున్న భామ భువనేశ్వరికి ఇటీవలి భారీ డిమాండ్
FileFILE
బుల్లితెరలో లభించే పాత్రలు వేసుకుంటూ కాలంగడుపుతున్న భామ భువనేశ్వరికి ఇటీవలి భారీ డిమాండ్ పెరిగిపోయింది. చెన్నైలో వ్యభిచార కేసులో చిక్కి, ఆ తర్వాత బయటపడిన ఈ శృంగారతారకు.. తాజాగా సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి. తన అందచందాలను "ఓపెన్‌"గా ఆరబోసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన ఈ సెక్సీక్వీన్.. ఏకంగా ముమైత్ ఖాన్, రమ్యశ్రీ స్థానాలపై కన్నేసింది. దీంతో ముమైత్, రమ్యశ్రీల కంటే తానేమి తక్కువ కాదని "భారీ"గానే డిమాండ్ చేస్తోంది. తన అందాలను రెప్పవాల్చకుండా చూసేందుకు కుర్రకారు పోటీ పడుతున్నారనే విషయాన్ని గ్రహించిన ఈ భామ.. పారితోషకాన్ని అమాంతం పెంచేసింది.

తాను ఒక చిత్రంలో నటిస్తే.. రూ.10 లక్షలు ఇవ్వాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలావుండగా.. తెలుగు చిత్రసీమకు అందుబాటులో ఎల్లపుడూ అందుబాటులో ఉండేందుకు హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో మకాం పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఓ ఇంటిని చూడాలని మధ్యవర్తికి కూడా చెప్పింది. తీరా ఇల్లు చూశాక భువనేశ్వరికి ఫోనే చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తోంది.

దీనిపై ఆమె మేకప్‌మేన్‌కు ఫోన్ చేయగా భువనేశ్వరి తమిళంలో ఒక చిత్రాన్ని నిర్మించే పనిలో బిజీగా ఉన్నారని చెప్పారు. భువనేశ్వరి తాజాగా బొమ్మనా బ్రదర్స్.. చందనా సిస్టర్స్ అనే చిత్రంలో ఒక పాటలో అందచందాలను ఆరబోయనుంది. ఆ పాట చిత్రీకరణ ఇంకా ప్రారంభంకాలేదు.
About Writer
PNR