1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

జూనియర్ ఎన్టీఆర్‌కు "పెళ్లికళ"

లావుగా
FileFILE
లావుగా, బొద్దుగా ఉండటం ఇష్టం లేకే తన భారీ కాయాన్ని తగ్గించుకున్నట్టు "కంత్రీ"గా రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అయినప్పటికీ... ఒక వేళ లావుగా కనిపిస్తే.. అది నా బ్యాడ్ టైమ్ అవుతుందన్నాడు. మా టీవీ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో జూనియర్ పాల్గొని తన లావుపై పెదవి విప్పాడు. ఇదిలావుండగా ఆయన సన్నిహితులు మాత్రం వచ్చే నవంబరులో జూనియర్ ఒక ఇంటివాడు కాబోతున్నాడని ఉప్పందించారు. ఇప్పటికే.. జూనియర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో జూనియర్‌ను కూడా ఓ ఇంటివాడిని చేసేందుకు ఆయన తల్లి సుగుణాలు కలిగిన చక్కటి యువతి కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే యువతరంలో ఓ స్టార్ రేంజ్‌గా ఉన్న ఎన్టీఆర్‌కు... పెళ్లి ఖాయమైతే మాత్రం అత్యంత వైభవంగా చేయాలని ఆయన తండ్రి, తెదేపా నేత, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ గట్టి పట్టుదలతోనే ఉన్నారు. ఇదిలావుండగా.. జూనియర్ నటించిన "కంత్రి" చిత్రం త్వరలో విడుదల కాబోతుంది.
About Writer
PNR