1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"జల్సా" విడుదలలో జాప్యం..!

వేసవి సెలవుల కోసం ఈ నెలలోనే మీ ముందుకు వచ్చి
FileFILE
వేసవి సెలవుల కోసం ఈ నెలలోనే మీ ముందుకు వచ్చి "జల్సా" చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గాడు. చిత్రం డిజిటల్ వర్క్‌ అసంపూర్తిగా మిగిలి ఉండటం, రిస్క్ తీసుకోవడం మంచిది కాదన్న ఆలోచనతో ఏప్రిల్‌లో ముందుకు రానున్నాడు. గత ఏడాదికాలంగా ఒక్క సినిమా కూడా చేయని పవన్ కళ్యాణ్ "జల్సా" చిత్రాన్ని పూర్తి చేసిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మాత అల్లు అరవింద్ రూ.28 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

అయితే చిత్ర నిర్మాణంలో తలెత్తిన సాంకేతిక కారణాల దృష్ట్యా చిత్రాన్ని వచ్చే నెలకు వాయిదా వేసినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని నిర్మాత మాత్రం ధృవీకరించలేదు. నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా రిలీజ్ చేస్తున్న ఈ చిత్రం 400 ప్రింట్లతో వెయ్యి థియేటర్లలో విడుదలకానుంది. ఒక్క జంటనగరాల్లోనే 52 థియేటర్లలో విడుదల చేయనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, ఇలియానా జంటగా నటించింది.
About Writer
PNR