1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సల్మాన్ అవమానాల జాబితాలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు

సల్మాన్ ఖాన్ జాబితా శంషాబాద్ ఎయిర్‌పోర్టు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు అవమానం జరిగింది. వివరాలలోకి వెళితే... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సల్లూ భాయ్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని అందుకున్న సల్లు శంషాబాద్ ఎయిర్ పోర్టు కాంప్లెక్స్‌కు చేరుకున్నాడు.

అయితే వేదికపై నుంచి సల్మాన్‌కు ఎంతకీ పిలుపు రాలేదు సరికదా... కార్యక్రమాన్ని నిర్వహించేవారు ఎవరూ సల్లూను పట్టించుకోలేదు. దీంతో సల్మాన్ సామాన్య ప్రజల మధ్యనే కూర్చిండిపోయాడు. 'ఎంత అవమానం' అంటూ ఆయన సన్నిహితులు మండిపడుతున్నారు. మొత్తానికి సల్మాన్ అవమానాల జాబితాలో శంషాబాద్ ఎయిర్ పోర్టు కార్యక్రమం కూడా చేరిపోయింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT