1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సంచలన వ్యాఖ్యలు చేసిన ఆశాషైనీ

గతంలో పాస్‌పోర్ట్ కుంభకోణం కోసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని వచ్చిన వార్తలు
FileFILE
గతంలో పాస్‌పోర్ట్ కుంభకోణం కోసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని వచ్చిన వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ ఆరోపణలు ప్రస్తుతం సినీ రంగానికి చుట్టుకున్నాయి. ఇటీవలే నకిలీ పాస్‌పోర్టుతో విదేశాలకు వెళ్లిన కుంభకోణంలో నటి ఆశాషైనీ వార్తలకెక్కిన విషయం తెల్సిందే. దీనికి ప్రధాన సూత్రధారుడైన వెంకటరెడ్డిని పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. ఈయన ఎవరనే విషయం కొంతమందికే తెలుసు. ఈ నేపథ్యంలో బెయిలుపై చెన్నైలో ఉంటున్న నటి ఆశాషైనీ బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసింది.

నటుడు మోహన్ బాబు వ్యక్తిగత కార్యదర్శి అయిన వెంకటరెడ్డి తనకు వీసా ఇప్పించాడని వెల్లడించింది. తనకు తెలియకుండా శ్రీలత అనే పేరును కూడా జతచేశాడని పేర్కొంది. ఇలా పరిశ్రమలోని చాలా మందికి వీసాలు ఇప్పించాడని తెలిపింది. ఈ వార్తల వెలుపడటంతో హైదారాబాద్‌ ఫిల్మ్ నగర్‌లో పెద్ద చర్చనీయాంశమైంది. సాధారణంగా విదేశాల్లో షూటింగ్ జరపాలంటే ముఖ్యంగా.. మహిళలను అధిక సంఖ్యలో తీసుకెళ్లాల్సి ఉంటుంది.

అందువల్లే వివిధ పేర్లతో వెంకట రెడ్డి నకిలీ పాస్ పోర్టులు సిద్ధం చేసి పలువురు మహిళలను విదేశాలకు తరలించి ఉంటారనే సందేహం పోలీసులకు కలిగింది. దీంతో ఆయన వద్ద విచారించాలని భావిస్తున్నారు. ఇదిలావుండగా.. సెంటిమెంటుతో సినీ ప్రముఖులు తమ పేర్లను మార్చుకుంటుంటారు. ఆ కోవలోనే నకిలీ పాస్ పోర్టు కేసులో అరెస్టైన ఆశాషైనీ తాజాగా తన పేరును మయూరిగా మార్చకుంది.
About Writer
PNR