ఘనంగా "చిరుత" పుట్టిన రోజు వేడుకలు
|
వారిలో నిర్మాత అల్లు అరవింద్, ఆయన కుమారుడు అర్జున్ తదితరులున్నారు. హీరో అయ్యాక రామ్‌చరణ్‌కు ఇది రెండో పుట్టినరోజు. అతని తొలి పుట్టినరోజు వేడుక 'చిరుత' సినిమా సెట్స్ మీద బ్యాంకాక్‌లో జరిగింది. తొలి సినిమాతో తనేమిటో నిరూపించుకున్న రామ్‌చరణ్‌కు ఈ రెండో సినిమా మరింత ఇమేజ్‌ను తెచ్చిపెడుతుందని సినీ పండితులు చెపుతున్నారు.
చిరుతనయునికి "కుచేలుడు" శుభాకాంక్షలు
ఈనెల 27వ తేదీ (గురువారం)తో 24వ యేటలోకి అడుగుపెట్టిన చిరంజీవి కుమారుడుకి దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో రామ్ చరణ్ జీవించాలని రజనీ తన ఆశీస్సులు అందజేసారు. రజనీకాంత్ ఒక తెలుగు హీరో కొడుకుకి ఇలా శుభాకాంక్షలు తెలియజేయడం ఇదే ప్రప్రధమం. ఇదిలావుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా చిరు అభిమానులు రామ్ చరణ్ అభిమానులు జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకాలు జరిపించారు.