కాళిదాసు'' ఆడియో విడుదల
'నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా, తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న 'కాళిదాసు' చిత్రం ఆడియో ఆవిష్కరణ అన్నపూర్ణ స్టూడియోలో చిత్రపరిశ్రమలోని అతిరథమహారథులు, అక్కినేని అభిమానుల నడుమ వైభవంగా జరిగింది.
కె. రాఘవేంద్రరావు ఆడియోను ఆవిష్కరించి అభిమానులకు కేసెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాజరైన నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, చలనచిత్ర రంగంలో అక్కినేనిది విశిష్టస్థానం. నాగార్జున కూడా తండ్రి పేరు నిలబెట్టి నటుడయ్యాడు. ఈ వంశం నుంచి వస్తున్న మరో హీరో సుశాంత్ 'కాళిదాసు' చిత్రంతో అఖండ విజయం సాధించాలని ఆశిస్తున్నానని అన్నారు.
నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నాగార్జున, సుమంత్ ఫారిన్‌లో చదువుకుని వచ్చాక వారి అభిరుచి మేరకే నటనారంగంలోనికి వచ్చారు. అదే రీతితో సుశాంత్ కూడా ఫారిన్ చదువు ముగిశాక నటుడు కావాలనే కోరికను వ్యక్తం చేశాడు. సరే అని ఆశీర్వదించాను. ఈ నటన వారసత్వంగా వచ్చింది కాదు. స్వతహాగా ఎవరికి వారు ఇంట్రెస్ట్‌తో చేస్తున్నదేనని అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ... ఇన్నేళ్లుగా నాన్నగారి అభిమానులు మా వంశం మీద చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే సుశాంత్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. సుశాంత్ మాట్లాడుతూ నేను ఎంత బాగా చేశాననేది సినిమా చూశాక చెప్పండి. మీ ఆశిస్సులే నాకు కొండంత బలాన్నిస్తాయి. అనంతరం నాగార్జున చేతుల మీదుగా అక్కినేని అభిమానులు ఏవీ రామరాజు, ఎన్. సర్వేశ్వరరావుతో పాటు పలువురు జిల్లాలకు చెందిన అభిమాన సంఘాల నాయకులకు కాళిదాసు క్యాసెట్‌ను అందించారు.