1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వెంకయ్య అవార్డుకు రామానాయుడు ఎంపిక

రామానాయుడు.. ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎంపికయ్యారు
ప్రముఖ చిత్ర నిర్మాత రామానాయుడు.. ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగు చలనచిత్ర సీమలో విశేష కృషి చేసినందుకు గాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారని సినీ వర్గాలు వెల్లడించాయి.

ఈ అవార్డు కింద జ్ఞాపికతో పాటు లక్ష రూపాయల రివార్డును బహుమతిగా అవార్డీకి ప్రదానం చేస్తూ.. శాలువాతో సత్కారం చేస్తారు. సుమారు 125 చిత్రాలను నిర్మించి ఇప్పటికే గిన్నీస్‌బుక్ రికార్డు పుటల్లోకి ఎక్కి తెలుగువారి వైభవాన్ని రామానాయుడు చాటిచెప్పారు.

1964లో రాముడు-భీముడు చిత్రంతో సినీనిర్మాతగా రంగ ప్రవేశం చేసిన రామానాయుడు ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు జీవం పోశారు. తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలనాడు మద్రాసు (చెన్నై) కేంద్రంగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమ నేడు హైదరాబాద్‌కు చేర్చడంలో రామానాయుడి పాత్ర ఎంతో కీలకం.
About Writer
Hanumantha Reddy