1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అభిమానుల సంతోషమే నా సంతోషం: బ్రహ్మానందం

అభిమానుల సంతోషం కోసమే తనకు జరిగే సన్మాన
FileFILE
అభిమానుల సంతోషం కోసమే తనకు జరిగే సన్మాన కార్యక్రమాలకు హాజరవుతున్నట్టు హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. చెన్నపురిలోని శ్రీకళాసుధా తెలుగు అసోషియేషన్ ఆధ్వర్వంలో పదో ఉగాది పురస్కార ప్రదానోత్సవంలో భాగంగా బ్రహ్మానందంకు "లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్" అవార్డును అందజేశారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం ప్రసంగిస్తూ.... తనకు గిన్నిస్ బుక్ రికార్డు అవార్డు లభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 70-80 సన్మాన కార్యక్రమాలు జరిగాయని, వాటిలో ఇదొకటని పేర్కొన్నారు. వీటిలో పాల్గొనేందుకు ప్రధాన కారణం ప్రేక్షకులను మరింత ఆనంద పడేలా చేయడం కోసమేనన్నారు.

అంతేకాకుండా ప్రేక్షకులు తన పట్ల చూప్తిసున్న ఆదరాభిమానాలు, వారి ఆశీస్సులతో తాను జీవితాంతం ఇలానే నటిస్తూ ఉంటానని ప్రకటించారు. ముఖ్యంగా ఎన్ని జన్మలెత్తినా ప్రతి ఒక్కరినీ కడుపుబ్బ నవ్వించే వాడిగానే పుట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ రుణాన్ని కూడా తీర్చుకోలేనని అన్నారు. ఎందుకంటే మన చిత్ర పరిశ్రమ ఇన్ని చిత్రాలు తీయకుంటే తాను 700 చిత్రాల్లో నటించే అవకాశం వచ్చేది కాదన్నారు. అందువల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు, అభిమాన ప్రేక్షక దేవుళ్లకు త్రికరణ శుద్ధిగా జీవితాంతం రుణపడి ఉంటానని బ్రహ్మానందం తెలిపారు.

ఈ కార్యక్రమంలో సినీ నటులు విశాల్‌, స్నేహా, తమన్నా, ఆర్పీ పట్నాయక్‌, నిర్మాతలు సిసి రెడ్డి, సి.కళ్యాణ్‌‌లకు శ్రీకళాసుధ తరపున వెండికిరీట ధారణ జరింగింది. ఇందులో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ వీఎస్‌ఆర్‌.స్వామి, కాట్రగడ్డ ప్రసాద్‌, ఐఏఎస్‌ అధికారి రామమోహన్‌ రావు, ఐపీఎస్‌ మాజీ అధికారి కెవిఎస్‌.మూర్తి, ఆర్చిడ్‌ కెమికల్స్‌ ఎండి.రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉగాది పురస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని చెన్నై నగర మేయర్‌ ఎం.సుబ్రహ్మణ్యం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకళాసుధ తెలుగు అసోషియేషన్ పుట్టు పూర్వోత్తరాలను ఆ సంస్థ వ్యవస్థాపకుడు బి.శ్రీనివాస్ సభకు వివరించారు.
About Writer
PNR