1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నితిన్‌తో ప్రియమణి

హాఫ్‌లో నితిన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు
ఏప్రిల్ సెకెండ్ హాఫ్‌లో నితిన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. నితిన్ సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటించనున్నట్లు ఆవర్గాలు తెలిపాయి. కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

గతంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన కుమార్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ రంగప్రవేశం చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రముఖ మోడల్ కెల్లీ ధోర్జీ ప్రతినాయిక పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు సంగీతదర్శకుడు అనూప్ ఇప్పటికే రికార్డు చేసినట్లు తెలిసింది.

డీఎస్ రావు ఈ చిత్రాన్ని నిర్మించగా... సాయికృష్ణ ప్రొడక్షన్స్ బేనరుపై రూపొందిస్తున్నారు.
About Writer
Hanumantha Reddy