నరేష్ హీరోగా ''దొంగలబండి'' రికార్డింగ్ ప్రారంభం
|
వినోద ప్రధానంగా తెరకెక్కనున్న ఈ చిత్రం రికార్డింగ్ కార్యక్రమం మంగళవారం ఎల్.జె. స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు ఇ.వి.వి. సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శక, నిర్మాతలు తలపెట్టిన ఈ ప్రయత్నం విజయం సాధించాలని అభిలషించారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ చిత్రం షూటింగ్‌ని జూన్ నెలలో ప్రారంభించనున్నామని తెలిపారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మనందం, అలీ, వేణుమాధవ్, ఎం.ఎస్. నారయణ, కొండవలస, కోవైసరళ తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా- అరుణ్‌కుమార్, సంగీతం- రాజశేఖర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం- వేగేశ్న సతీష్.