1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఫారెస్ట్ నేపథ్యంలో ''పల్లవి'' ప్రారంభం

ఫారెస్ట్ నేపథ్యం పల్లవి ప్రారంభం
WD PhotoWD
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల హవా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రాచీ అధికారి ప్రధాన పాత్ర పోషిస్తోన్న పల్లవి అనే చిత్రం షూటింగ్ మంగళవారం ప్రారంభమైంది. రాజేష్ పుప్పాల స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో నర్సింగ్ యాదవ్, మహేష్‌యాదవ్, శ్రీశైలం యాదవ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ తాజాగా విడుదలైన మంత్ర, అనసూయ చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమని తెలిపారు. చిత్రం కథ మొత్తం అడవిలోనే జరుగుతుందని ఆయన వివరించారు.

షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా- శ్రీరామ్, సంగీతం- మోహన్, కూర్పు- శ్రీనివాస్, కథ, మాటలు, చిత్రానువాదం, నిర్మాత, దర్శకత్వం- రాజేష్ పుప్పాల.
About Writer
Munibabu