గంధర్వ గాయని ''సుశీల''ను వరించిన స్వరలయ అవార్డ్
|
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో 1935లో జన్మించిన పులపాక సుశీల దక్షిణాది భాషలైన తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో అనేక పాటలు పాడి శ్రోతలను అలరించారు. ఈ క్రమంలో సుశీల ప్రతిభను మెచ్చి ఆమెను వరించిన పురస్కారాలకు కొదవలేదు.
ఉత్తమ నేపథ్య గాయనిగా సుశీల ఇప్పటి వరకు ఐదుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. 1969, 1972,1978, 1983,1984ల్లో సుశీల అందుకున్న జాతీయ చలనచిత్ర అవార్డులు ఆమె ప్రతిభకు తార్కాణాలు.
అలాగే 2001లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుగా రఘుపతి వెంకయ్య అవార్డును అందించి గౌరవించింది. వీటితోపాటు సంగీతంలో సుశీల కనబరిచిన విశేష ప్రతిభకు గుర్తుగా 2005లో స్వరలయ ఏసుదాస్ అవార్డును సైతం అందుకున్నారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వంచే పద్మభూషన్ అవార్డును సైతం అందుకున్న సుశీల సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.