1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మీరాజాస్మిన్‌తో ''ఒకటీ నాలుగు'' షూటింగ్ ప్రారంభం

మీరాజాస్మిన్‌ ఒకటీ నాలుగు షూటింగ్
FileFILE
మీరాజాస్మిన్ ప్రధాన భూమిక పోషించనున్న ఒకటీ నాలుగు అనే చిత్రం బుధవారం ప్రారంభమైంది. ప్రసాద్‌ల్యాబ్ ఆవరణలో ఈ చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.

దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు క్లాప్ కొట్టగా, రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. గమ్యం దర్శకుడు క్రిష్ ఈ సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ లేడీ ఓరియెంటెడ్ కథతో రూపొందుతూ చక్కని సందేశం ఇమిడి ఉన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రాజ్ కంబైన్స్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు.

చిత్ర దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ తనకు ఎస్.వి.కృష్ణారెడ్డి, భరత్ దగ్గర పనిచేసిన అనుభవముందన్నారు. ఓ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని ఏవిధంగా ఎదుర్కొంది అనేది ఈ చిత్రంలో ప్రధాన పాయింట్ అని తెలిపారు. ఇందుకోసం ఓ నలుగురు ఆమెకు ఎలా సహకరించారు అనేది ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు.

మే 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నామని తెలిపారు. చిత్ర మాటల రచయిత స్వామి మాట్లాడుతూ నలుగురు ఆకతాయిలకు, ఓ అమ్మాయికి మధ్య జరిగే చక్కని యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని అన్నారు.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ధర్మవరపు, మేల్కోటే, శివన్నరాయణ, మాస్టర్ భరత్, హేమ, పద్మాజయంతి తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా- ఎ. రాజా, సంగీతం- అగస్థ్య, రచన సహాకారం- వెంకట్ బాబి, నిర్మాణం- రాజ్‌కంబైన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- ప్రభాకర్.
About Writer
Munibabu