1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నితిన్, మమతామోహన్‌దాస్ జంటగా ''విక్టరీ'' షూటింగ్ పూర్తి

నితిన్
FileFILE
నితిన్, మమతామోహన్‌దాస్ జంటగా నటిస్తున్న చిత్రం విక్టరీ. ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే ఈ చిత్రం డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుని ప్రస్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రం ట్రైయిలర్‌ను బుధవారం రాత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు అచ్చిరెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం దర్శకుడు రవి.సి. కుమార్ కథలో భాగంగా నితిన్‌ను కొత్త కోణంలో చూపించారని అన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన చక్రి చక్కని బాణీలు అందించారని ఆయన తెలిపారు.

థియేటర్ ట్రైలర్స్‌కు జగపతిబాబు వాయిస్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఆయన చెప్పారు. ఈ చిత్రం ఆడియోను మే 11న ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తేనున్నట్టు ఆయన తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ కథతోపాటు కథనం బాగుంటేనే నేడు చిత్రాలు విజయం సాధిస్తున్నాయన్నారు. ఆ బాటలో ముగ్గురు రచయితలు మంచి కథను ఎంచుకుని ఈ చిత్రం కథను సిద్ధం చేశారని ఆయన వివరించారు.

ఎడిటర్ కె.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ కథ నచ్చి అందులో ఇన్వాల్వ్ అయ్యి తగు సూచనలు చేసిన చిత్రమిదని అన్నారు. టెక్నీషియన్ల ప్రతిభ ఈ చిత్రంలో కన్పిస్తుందన్నారు.

ఈ చిత్రంలో శశాంక్, సింధుతులానీ, అశుతోష్‌రాణా, రవిబాబు, అజయ్, రంగనాథ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి పాటలు- చంద్రబోస్, కలువ కృష్ణసాయి, కెమెరా- విజయ్.సి.కుమార్, నిర్మాత- వెంకట్, సహానిర్మాత- సురేష్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- రవి.సి.కుమార్.
About Writer
Munibabu