1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

శ్రీహరి హీరోగా ప్రారంభం కానున్న ''సామ్రాజ్యం''

శ్రీహరి హీరో సామ్రాజ్యం
FileFILE
రియల్ స్టార్ శ్రీహరి హీరోగా సామ్రాజ్యం అనే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. సిద్ధి వినాయక ఫిలిమ్స్ పతాకంపై వీరు కె. దర్శకునిగా ఈ చిత్రం తెరకెక్కనంది. గర్ల్‌ఫ్రెండ్, సీమశాస్త్రి చిత్రాల సమర్పకుడు ముత్యాల ఆంజనేయులు నిర్మాతగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.

మే 12 నుంచి షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్ర విశేషాలను తెలపడం కోసం ఆ చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీహరి మాట్లాడుతూ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుందని తెలిపారు. ఇంతవరకు రాని రీతిలో ఈ చిత్రం కథ ఉంటుందని ఆయన అన్నారు.

మాస్, యాక్షన్ కథాంశమే అయినా కథ కొత్త తరహాలో ఉంటుందని ఆయన తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ స్వామి చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని తీయడానికి ముందుకొచ్చామన్నారు. ఈ కథకు శ్రీహరి సరిపోతారని, వెళ్లి అడగగానే శ్రీహరి ఒప్పుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 12 నుంచి చెన్నై, ఊటీ, రామేశ్వరం తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నట్టు ఆయన వివరించారు. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లోనూ షూటింగ్ ఉంటుందని ఆయన తెలిపారు.

రచయిత ఎం.ఎస్. ప్రకాష్ మాట్లాడుతూ కత్తి పట్టుకున్నవాడు ఆ కత్తికే బలికావల్సిందే. అయితే ఆ తర్వాత అతని కుటుంబ పరిస్థితి ఏంటి అన్న పాయింట్‌తో ఈ చిత్రం ఉంటుందని అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం- దేవా, పాటలు- భాస్కరభట్ల, కందికొండ, కలువకృష్ణసాయి, కథ- స్వామీజీ, విజ్జీ, ఫైట్స్- రామ్-లక్ష్మణ్, కెమెరా- రాజేంద్ర, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- ద్వైత్ వీరు.
About Writer
Munibabu