శ్రీనువైట్ల దర్శకత్వంలో నాగార్జున కొత్తచిత్రం
|
కామాక్షి కళా మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 11గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా ప్రారంభమైంది. దేవుని చిత్రపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ కొట్టగా, అక్కినేని అమల కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాగార్జున కుటుంబసభ్యులతో పాటు కెమెరామెన్ ప్రసాద్ మారెళ్ల, రచయిత గోపీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ మే 21 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపులోనుందని తెలిపారు.
ఈ చిత్రంలో త్రిష కథానాయకగా నటించనుండగా ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. డాన్ తర్వాత హీరో నాగార్జున నటిస్తున్న ఈ చిత్రానికి కింగ్ అనే పేరు ప్రచారంలో ఉన్నా దర్శక, నిర్మాతలు మాత్రం ఇంకా పేరును అధికారికంగా ప్రకటించలేదు.