రీ-రికార్డింగ్ జరుపుకుంటోన్న ''1940లో ఒక గ్రామం''
|
ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్టవోయ్ అన్న గురజాడ వారి స్పూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలోని కథలో రెండు కోణాలుంటాయని ఆయన తెలిపారు.
కులము దాని మూలాల గురించి చర్చిస్తూనే, పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ స్వేచ్ఛ అనే విషయం గురించి కూడా ఈ చిత్రంలో ప్రస్తావించడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో రెండు పాటలు ఐదు పల్లవులు ఉంటాయని ఆయన తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం- సాకేత్‌సాయిరామ్, కెమెరా- మురళీమోహన్‌రెడ్డి, మాటలు- నహసింహనంది, రఘుబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- నరసింహనంది.