ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'ఇదీ... అసలు కథ' టాకీ పూర్తి
EdhiAsalukatha
WD PhotoWD
'బ్యాచిలర్స్', 'కుచ్చికుచ్చి కూనమ్మ' చిత్రాల ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న జాకీర్ ప్రస్తుతం దర్శకునిగా మారి రూపొందించిన చిత్రం 'ఇదీ... అసలు కథ'. విజయమాధవి మూవీస్ పతాకంపై యం.ఎ.రాజు నిర్మాతగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎవిన్ సింగ్, ఆకాంక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రం ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం ఫిలింఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ అంశంతో ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు. రెండేళ్ల క్రితం సిద్ధం చేసుకున్న ఈ కథను ప్రస్తుతం తెరకెక్కించడం జరిగిందని ఆయన చెప్పారు.

ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం టాకీని పూర్తి చేసుకుందని, సోమవారం నుంచి పాటల చిత్రీకరణ ప్రారంభిస్తామని తెలిపారు. అన్ని కార్యక్రమాలను త్వరలోనే పూర్తిచేసి జూన్ రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ బ్లాక్‌మెయిల్ కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని ఎవరు ఎవరిని బ్లాక్‌మెయిల్ చేశారన్న విషయం మాత్రం సస్పెన్స్ అని అన్నారు. ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ చక్కని సంగీతాన్ని అందించారని ఆయన తెలిపారు.

ఈ చిత్రం హీరో ఎవిన్ సింగ్ మాట్లాడుతూ ముంబాయిలో మాడల్‌గా ఉండే తనను తెలుగు చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారని అన్నారు. థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు చక్కగా రూపొందించారని పేర్కొన్నారు.

ఈ చిత్రానికి కెమెరా- మురళీ వై.కృష్ణ, ఎడిటర్- కె.రమేష్, పాటలు- తైదలబాపు, సహనిర్మాతలు- పి. జయంతి వర్మ, డి.రాఘవరాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- జాకీర్.
మరిన్ని
చివరివరకు దర్శకునిగా ఉండాలన్నదే కోరిక: దాసరి
రీ-రికార్డింగ్ జరుపుకుంటోన్న '1940లో ఒక గ్రామం'
'భారత్ మహాన్.కామ్' ఆడియో విడుదల
'హ్యాపీడేస్' ఫేమ్ వరుణ్‌తో 'ఏవీఎం' 172వ చిత్రానికి శ్రీకారం
శ్రీనువైట్ల దర్శకత్వంలో నాగార్జున కొత్తచిత్రం
శ్రీహరి హీరోగా ప్రారంభం కానున్న 'సామ్రాజ్యం'