ఆ సినిమా చూసి ఏడ్చేశాను: ఇలియానా
|
ఖతర్నాక్‌లో ఎందుకు నటించారు అని అభిమానులు అడిగినప్పుడు అర్థంకానిది, చిత్రం గురించి, నా గురించి చెడుగా సమీక్షలు రాసింది ఎందుకు అన్నది సినిమా చూస్తేగానీ బోధపడలేదు. కొన్ని భంగిమల్లో నన్ను జుగుప్సాకరంగా చూపించారు. " అంటూ తన బాధను వెళ్లగక్కింది ఇలియానా. ఇలాంటి సందర్భాన్నే ఆట చిత్రంలో ఎదుర్కొన్నానంది. ఈ చిత్రం పట్ల దర్శక నిర్మాతలకు స్పష్టమైన క్లారిటీ లేదనీ, ఈ గందరగోళంలో తన పాత్ర గురించి సరిగా వివరించలేదనీ ఆరోపించింది. అంటే కథలో వివరించినట్లు ఉన్నదిఉన్నట్లుగా చిత్రీకరించాలని ఇలియానా ఆలోచన కాబోలు. విన్నారుగా దర్శకులూ...