1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సాధారణ యువతి పాత్రలో ముమైత్‌ఖాన్ చిత్రం

సాధారణ యువతి పాత్ర ముమైత్‌ చిత్రం
WD PhotoWD
ఐటంసాంగ్‌ల నుంచి హీరోయిన్ స్థాయికి చేరుకున్న ముమైత్‌ఖాన్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రతో పలు చిత్రాలు ప్రారంభమయ్యాయి. ఇదేకోవలో ముమైత్ ప్రధానపాత్రలో నటించనున్న ఓ చిత్రం ఇటీవల ప్రారంభమైంది.

చెరుకూరి సాంబశివరావు దర్శకత్వంలో పి. శ్రీనివాస్‌చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూబ్లిహిల్స్‌లోని సాయిబాబా టెంపుల్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ముమైత్‌ఖాన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు దర్శకుడు చంద్రమహేష్ క్లాప్ ఇవ్వగా, కాజా సూర్యనారాయణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ సామాజిక, రాజకీయ, ఆర్థిక కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని తెలిపారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నామని ఆయన వివరించారు.

ముమైత్‌ఖాన్ మాట్లాడుతూ గతంలో యాక్షన్ చిత్రాల్లో నటించానని, ఈ చిత్రంలో ఓ సాదాసీదా అమ్మాయిగా నటించనున్నానని తెలిపారు. హావభావాలు పలికించడానికి వీలున్న పాత్ర ఈ చిత్రంలో తాను పోషిస్తున్నానని ఆమె చెప్పారు.

ఈ చిత్రానికి కెమెరా- ప్రభు, మాటలు- వై.ఎస్. కృష్ణేశ్వరరావు, వరికూటి శివప్రసాద్, రచనా సహకారం- మండెపుడు పూర్ణ, సంగీతం- కృష్ణసాయి, సమర్పణ- మాస్టర్ రామ్‌తేజేశ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- చెరుకూరి సాంబశివరావు.
About Writer
Munibabu