1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''బూత్‌నాథ్‌'' చిత్రాన్ని తిలకించిన ''బిగ్‌ బి''

నాసిక్‌లో కొత్తగా నిర్మించిన సినిమాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్‌ను బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్
నాసిక్‌లో కొత్తగా నిర్మించిన సినిమాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్‌ను బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సందర్శించారు. ఈ సినిమాక్స్‌లోనే అమితాబ్ తాజాగా నటించిన 'బూత్‌నాథ్' చిత్రాన్ని తిలకించారు.

గురువారం రాత్రి మల్టీఫ్లెక్స్‌కు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ చేరుకున్నారు. ఈ వార్త ముందుగానే లీక్ కావడంతో తమ ఆరాధ్య నటుడిని కనులారా చూసేందుకు గాను వందలాది మంది అభిమానులు థియేటర్‌ వద్దకు చేరుకున్నారు.

అభిమానుల ఉత్సాహాన్ని చూసిన అమితాబ్ వారికి అభివాదం చేశారు. అమితాబ్ చిత్రం తిలకించి బయటకు వచ్చేంత (అర్థరాత్రి) వరకు అభిమానులు థియేటర్ వద్దే ఉన్నారు. నాసిక్‌లో జరుగుతున్న 'జానీ వాకర్' చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు అమితాబ్ అక్కడే ఉన్నారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి