1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సిక్స్ ప్యాక్ బాడీ కోసం చాలా కష్టపడ్డా: నితిన్

సిక్స్ ప్యాక్ బాడీ కష్టపడ్డా నితిన్
WD PhotoWD
త్వరలో విడుదల కానున్న విక్టరీ చిత్రంలో నితిన్ సిక్స్ ప్యాక్ బాడీతో కన్పించనున్నాడు. బాలీవుడ్‌లో మొదలైన ఈ ట్రెండ్ ప్రస్తుతం దక్షిణాదికి చేరింది.

దేశముదురు చిత్రంలో హీరో అల్లు అర్జున్ తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. ఆ తర్వాత నితిన్ ఈ ప్రయోగానికి పూనుకున్నాడు. బక్కపల్చని శరీరంతో కనిపించే నితిన్ హఠాత్తుగా ఈ సిక్స్ ప్యాక్ బాడీకి మారడానికి పడ్డ కష్టాలను స్వయంగా వివరించాడు.

విక్టరీ చిత్రాన్ని అనుకున్నప్పుడు ఇలా సిక్స్ ప్యాక్ బాడీకి మారాలని దర్శకుడు తనను ఒప్పించారని నితిన్ చెప్పాడు. అయితే కష్టమైన ఈ వ్యాయామాల్ని తనకు ఇష్టంలేకపోయినా కోచ్‌ను పంపిమరీ తనచేత బలవంతంగా చేయించారని తెలిపాడు.

కొన్నిసార్లు తాను చేయలేనని చెప్పినా, ఒంట్లో నలతగా ఉన్నా కూడా విడవకుండా కోచ్‌లు సంపత్‌రెడ్డి, వెంకట్‌లు పట్టుబట్టి మరీ చేయించేవారని నితిన్ తెలిపారు. ప్రస్తుతం తన బాడీని చూచి తన అభిమానులు బాలీవుడ్ హీరోలా ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారని నితిన్ చెప్పారు.

అయితే సినిమా కోసం ఇంతలా కష్టపడి మరీ పెంచిన ఈ సిక్స్ ప్యాక్ బాడీ నితిన్‌కు ఏమాత్రం పేరు తెస్తుందో విక్టరీ విడుదలైతేనే తెలుస్తుంది.