1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పాటల చిత్రీకరణ జరుపుకుంటోన్న ''బ్లేడు బాబ్జీ''

పాటల చిత్రీకరణ జరుపు బ్లేడు బాబ్జీ
WD PhotoWD
అల్లరి నరేష్ హీరోగా, గుజరాతీ నటి సయాలీభగత్ హీరోయిన్‌గా దేవీప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం బ్లేడు బాబ్జీ. సత్యమూవీస్ పతాకంపై ముత్యాల సత్యకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటివరకు ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ పాటలను బ్యాంకాక్‌లో చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ పాటల చిత్రీకరణతో పాటే పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, జూన్ రెండోవారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సక్సెస్ కోసం ఇష్టంగా కష్టపడి తాను చేస్తున్న చిత్రం ఇదని ఆయన అన్నారు. పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందని ఆయన తెలిపారు.

చిత్ర హీరో నరేష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన క్రెడిట్ మొత్తం దర్శకుడు, రచయితలదే అన్నారు. గత చిత్రాల కన్నా తనను ఓ మెట్టు పైనుంచేలా ఈ చిత్రం రూపొందుతోందని ఆయన తెలిపారు.

హీరోయిన్ మాట్లాడుతూ 2004లో తాను మిస్ ఇండియాగా ఎంపికయ్యాక తొలుత ట్రైన్ అనే చిత్రంలో నటించానని అన్నారు. తెలుగులో తనకు ఇది తొలి చిత్రమని, వృత్తిపరంగా ఈ చిత్రం సంతృప్తినిచ్చిందని తెలిపారు.

చిత్ర నిర్మాత సత్యకుమార్ మాట్లాడుతూ కామెడీ చిత్రాలకు టైమ్ సెన్స్ చాలా ముఖ్యం. అలాంటి టైమ్ సెన్స్ ఉన్న నటులతో ఈ చిత్రం రూపొందుతోందన్నారు.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రుతిక, కౌష, బ్రహ్మానందం, వేణుమాధవ్, హేమసుందర్, హర్షవర్ధన్, ఖయ్యూం, దేవీశ్రీ, బాలాజీ, తెలంగాణ శకుంతల తదితరులు నటించారు.

ఈ చిత్రానికి కథ, మాటలు- వేగేశ్న సతీష్, పాటలు- శుద్ధాల అశోక్‌తేజ, అనంత్ శ్రీరాం, సాహితీ, సంగీతం- కోటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- దేవీప్రసాద్.
About Writer
Munibabu