1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''తమషా చూద్దాం రండి'' ఆడియో విడుదల

తమషా చూద్దాం రండి ఆడియో విడుదల
WD PhotoWD
వేణు, సుహాసిని జంటగా అశోక్‌రావు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'తమషా చూద్దాం రండి'. ఈ చిత్రం సీనియర్ నటుడు నరసింహరాజు ఆధ్వర్యంలో రూపొందండం విశేషం. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి హాజరైన ఎం.ఎస్.రెడ్డి చిత్రం ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం చాలా పెరిగిపోయిందని అలాంటి సమయంలో ఈ చిత్రం కేవలం యాభై లక్షలతో పూర్తయ్యిందంటే నమ్మలేక పోయానని అన్నారు. ఏ చిత్రానికైనా కథ ముఖ్యమని కథ బాగుంటే నటులతో సంబంధం లేకుండా ప్రేక్షకులు చూస్తారని ఆయన అన్నారు.

చిత్ర దర్శకుడు అశోక్‌రావు మాట్లాడుతూ జీవితానికి కమిట్‌మెంట్ ముఖ్యమనే అంశాన్ని ఈ చిత్రంలో వివరించామని తెలిపారు. చిత్రం మొత్తం కామెడీతో నిండి ఉంటుందన్నారు.

తమ్మరెడ్డి భరధ్వాజ మాట్లాడుతూ గతంలో నరసింహరాజు చాలా చిత్రాల్లో హీరోగా చేశారని అలాంటి వ్యక్తి పర్యవేక్షణలో ఈ చిత్రం రూపొందడం ఆనందమని అన్నారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రమోద్‌కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియోను రిలయన్స్ బిగ్‌మ్యూజిక్స్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రానికి కథ, మాటలు- బొల్లిముంత నాగేశ్వరరావు, సహనిర్మాత- బచ్చు సత్యనారాయణ.
About Writer
Munibabu