యాక్షన్ కథా చిత్రంగా రానున్న శ్రీశైలం
|
ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ దేశాన్ని కాపాడడానికి సరిహద్దుల్లోనే కాదు దేశం లోపల కూడా సైనికులుండాలి అన్న పాయింట్‌తో ఈ చిత్రం రూపొందుతోందన్నారు.
ఈ చిత్రంలో శ్రీహరి లేడీస్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు డ్రైవర్‌గా నటిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ చిత్రం కోసం శ్రీహరి ఎంతో రిస్క్ తీసుకుని మరి ఫైట్స్ చేశారని ఆయన తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ తొలి షెడ్యూల్ సందర్భంగా ఏప్రిల్‌లో కాశ్మీర్‌లో షూటింగ్ జరిపామని అన్నారు.
పాకిస్థాన్ సరిహద్దులో గల ప్రాంతంలో మైనస్ 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ఉష్ణోగ్రత వాతావరణంలో షూటింగ్ జరిపామని ఆయన వివరించారు. ప్రస్తుతం జరుగుతున్నది చివరి షెడ్యూల్ అని ఆయన తెలిపారు.
ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో యశ్వంత్‌శర్మ, షరీఫ్, పొట్టి రాంబాబు, అక్షయ్, శివ, విజయ్, సుహాని, సింధు, రజని, నవ్య తదితరులు నటింతారు. ఈ చిత్రానికి మాటలు- స్వామీజీ వియ్, పాటలు- భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, శ్రీనుపైడిపల్లి, సంగీతం- శ్రీసాయి.
